2021లో తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. సినిమాలోని నటీనటులకు మంచి పేరు రాగా ప్రొడ్యూసర్లకు భారీగా లాభాలు వచ్చాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1. జాతి రత్నాలు
ఈ సినిమా గొప్ప కథతో తెరకెక్కకపోయినా మూడు గంటల పాటు కడుపుబ్బా నవ్వించి 2021లో జాతిరత్నం అనిపించుకుంది. ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకులే కాక సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2021లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 70 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
#2 జాంబి రెడ్డి
తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా జాంబీరెడ్డి. జాంబీస్ తో కామెడీ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.10.33 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Advertisement
#3 ఉప్పెన
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుజ్జి బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం మంచి విజయం సాధించింది. 22 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
#4 రాజ రాజ చోర
శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం రాజ రాజ చోర. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా రూ.7 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
#5 సినిమా బండి
ఈ సినిమా ఓటిటిలో విడుదలైంది. ఊర్లో ఉండే ఆటో డ్రైవర్ కు కెమెరా దొరకడం. అతడు కెమెరాతో సినిమా తీయాలనుకోవడం లాంటి సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. థియేటర్ లో ఈ సినిమాను విడుదల చేసి ఉంటే కలెక్షన్లు కూడా ఎక్కువే వచ్చేవి.
Also read : 2021 చివరలో విడుదలవుతున్న 5 చిత్రాలు ఇవే..!