తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ స్వల్ప అశ్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో కేసీఆర్‌కు సిటీ స్కాట్, యాంజియోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హుటాహుటిన యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఎంపీ సంతోష్‌కుమార్ కేసీఆర్ మనమడు హిమాన్షు కూడా ఆసుపత్రికి వచ్చారు.
Advertisement
Advertisement
కేసీఆర్ అశ్వస్థతకు గురి కావడంతో ఆయన వ్యక్తి గత వైద్యులు ఎంవీ రావు స్పందించారు. కేసీఆర్ రెండు రోజులు వీక్ గా ఉన్నార ని వెల్ల డించారు. ఎడమచేయి లాగుతుందని కేసీఆర్ చెప్పారని అన్నారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని సూచిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగగానే ఉందని యశోద వైద్యులు వెల్లడించారు.
చేయి నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి ఎమ్మార్ఐ స్పైన్‌లో చిన్న సమస్య వచ్చినట్టు పేర్కొన్నారు. సర్వైకల్ స్పైన్‌లో ఉన్నదని సూచించిన కొంచెం తేడా. అందువ’ల్ల’నే ఎడమ చేయి నొప్పి వచ్చింద’ని డాక్టర్లు చెప్పారు. ఇది పెద్ద సమస్య కాదని.. వయస్సు రిత్యా ఇలా వచ్చేందే అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అశ్వస్థతకు గురవ్వడంతో ఇవాళ యాదాద్రి పర్యటన వాయిదా పడింది.