Home » రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీత మాధురి..!

రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీత మాధురి..!

by Anji
Ad

సింగర్ గీతామాధురి అంటే చాలామంది సంగీత ప్రియులకు సుపరిచితమైన అమ్మాయి. ఇండస్ట్రీకి ప్లే బ్యాక్ సింగర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో తన పాటలతో అలరించి స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకుంది.  తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్స్‌లో గీతా మాధురి- నందుల జోడీ ఒకటి.

Advertisement

2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటారు. ఆ మధ్యన వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తే నవ్వుకుని తమ ప్రేమ బంధాన్ని చాటుకున్నారు. ఈ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగానే 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇక రీసెంట్ గా నందు గీత మాధురి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలకు నందు పులిస్టాప్ పెట్టారు. నందు తాజాగా అవికా గోర్ తో కలిసి వధువు అనే వెబ్ సిరీస్ చేశారు.ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నందు తమ మధ్య గొడవలు లేవని మేం కలిసే ఉంటున్నాం అని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా సోషల్ మీడియా ఖాతాలో గీతామాధురి  పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. గీత మాధురి తన సోషల్ మీడియా ఖాతాలో ఫిబ్రవరిలో నా కూతురు అక్క కాబోతుంది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. ఆ పోస్ట్ కి ఫోటోలు కూడా జోడించి పెట్టింది. ఇక ఆ ఫోటోలలో గీతామాధురి బేబీ బంప్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దాంతో గీతామాధురి తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అందరూ క్లారిటీ కి వచ్చారు. ఇక గీత మాధురి ఆ పోస్ట్ పెట్టడంతో సెలబ్రిటీలు,అభిమానులు అందరూ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.

Visitors Are Also Reading