కాఫీ తాగడం వలన ఎంతో రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక కప్పు కాఫీ తాగితే తలనొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. బద్ధకంను కూడా తగ్గించుకోవచ్చు. అయితే కాఫీ తో ఇలా ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది. అందాన్ని పెంపొందించుకోవాలంటే కాఫీ ని మీరు ఇలా ఉపయోగించండి. కాఫీ తో ముడతలు కూడా రాకుండా ఉంటాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ల ముందు కూర్చుంటున్నారు డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. డార్క్ సర్కిల్స్ నుండి దూరంగా ఉండడానికి కాఫీ బాగా పనిచేస్తుంది. కాఫీ నీ కళ్ళ కింద రాయడం వలన డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.
Advertisement
Advertisement
కాఫీ పొడి చర్మానికి స్క్రబ్ గా పని చేస్తుంది చర్మంపై ఉన్న మృత కణాలని ఇది తొలగించగలదు. కాంతివంతమైన చర్మాన్ని పొందాలంటే కాఫీ ని ముఖానికి రాయడం మంచిది. స్నానం చేసేటప్పుడు కాఫీ పొడితో ముఖాన్ని రుద్దుకుంటే చర్మం చాలా అద్భుతంగా మారుతుంది. ముడతలు కూడా రాకుండా ఉంటాయి. యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది కాఫీ. కాఫీ గింజలని ఒక కప్పు నీళ్ళల్లో వేసి టీ ట్రీ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా బ్లెండ్ చేసి బ్రష్ తో ముఖానికి రాసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. రెండు స్పూన్ల కాఫీ పొడి, తేనె తీసుకుని దీనిని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగి కడిగేసుకుంటే సరిపోతుంది కాఫీ ట్యాన్ ని తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమ అందిస్తుంది.
Also read:
- చాణక్య నీతి: భార్య సంతోషంగా ఉండాలంటే.. భర్త ఈ 5 తప్పక పాటించాలి..!
- అస్సలు వీటిని మీ జీవితభాగస్వామి తో చెప్పద్దు… చెప్తే అంతే సంగతులు…!
- Pallavi prashanth :పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందా.. అమ్మాయి ఈవిడే..!