టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా రక్షిత అనే యువతి తో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రామ్ చరణ్ ఉపాసన, చిరంజీవి సురేఖతో పాటు నాగార్జున ఫ్యామిలీ సైతం హారయ్యింది. ఇక ఈ ఎంగేజ్ మెంట్ కు పలువురు సిద్ధార్థ్ కూడా వచ్చాడు.
అయితే సిద్ధార్థ్ సింగిల్ గా రాలేదు. సిద్ధార్థ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ అధితి రావు హైదారి కూడా వచ్చింది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి శర్వానంద్ జంట తో కలిసి ఫోటో దిగారు. అయితే గతం లో శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలు గా మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో అధితీ హీరోయిన్ గా నటించింది. కాగా సినిమా సమయం లో సిద్దార్థ్ తో అధితీ రావు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరవాత కూడా కూడా సిద్ధార్థ్ అధితి కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
Advertisement
Advertisement
గతంలో ఇద్దరు కలిసి ముంబై లో మీడియా కు చిక్కారు. ఆ సమయంలో సిద్ధార్థ్ ఫోటో లు లీక్ చేయవద్దు అని మీడియా ను కూడా హెచ్చరించాడు. ఆ నాటి నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇద్దరూ ఇప్పుడు శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో కనిపించడం తో సిద్ధార్థ్ తన రిలేషన్ షిప్ ను బయటపెట్టడానికే హీరోయిన్ తో కలిసి వచ్చడా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
Also read :బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు