Home » బొమ్మరిల్లు సినిమాకి “సిద్దార్థ్” విషయంలో ఇంత అన్యాయం జరిగిందా ? మూవీ బ్లాక్ బస్టర్ కానీ..?

బొమ్మరిల్లు సినిమాకి “సిద్దార్థ్” విషయంలో ఇంత అన్యాయం జరిగిందా ? మూవీ బ్లాక్ బస్టర్ కానీ..?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోలలో చాలామంది సక్సెస్ అయ్యారు. కొంతమంది ఫెయిల్ అయి ఇంటికి వెళ్లారు. అయితే హీరో సిద్ధార్థ మాత్రం అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులకు కనిపించి వెళ్తున్నాడు. ఏజ్ పైబడినప్పటికీ.. తనలో ఏమాత్రం గ్లామర్ పోలేదని… వరుసగా సినిమాలు చేస్తున్నాడు హీరో సిద్ధార్థ. తెలుగులో చాలా సినిమాలు చేసిన సిద్ధార్థ… ఓ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ హీరో.

Advertisement

ఆ తర్వాత… లవర్ బాయ్ గా కూడా చాలా సినిమాలు చేశాడు హీరో సిద్ధార్థ్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవార్డ్స్ వచ్చిన నేపథ్యంలో… తనకు అన్యాయం జరిగిందని అర్థం వచ్చేలా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలకు చాలా నంది అవార్డ్స్ వచ్చిన తనకు హీరోగా రాలేదని వెల్లడించారు సిద్దార్థ్. కనీసం నాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

దానికోసం నేను బాధపడుతూ ఇంట్లో కూర్చోలేని కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్. అయితే ఇప్పటికి ఈ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని కనిపించినప్పుడు అడిగితే చాలా ఆనందంగా ఉంటుందంటూ సిద్ధార్థ చెప్పుకొచ్చారు. కాగా సిద్ధార్థ కెరీర్ లో అనేక మంది హీరోయిన్లతో అఫ్ఫైర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో హీరోయిన్ సమంతతో డేటింగ్ చేశాడు హీరో సిద్ధార్థ్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అలాగే అమలాపాల్ తో కూడా హీరో సిద్ధార్థ రొమాన్స్ చేసినట్లు ఓ వార్త అయితే, వైరల్ అయింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నటి మహేశ్వరికి…శ్రీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా….?

అఖిల్ ను ‘అయ్యగారు’ అని ఎందుకు పిలుస్తారు ?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లా మల్టీ స్టారర్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే ?

Visitors Are Also Reading