ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్తగా వచ్చిన రెండు జట్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక్కటి. అయితే ఈ జట్టు వేలం కంటే ముందే డ్రాఫ్ట్ పద్ధతిలో హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ లను ఎంపిక చేసుకుంది. అయితే ఈ ముగ్గురితో పాటుగా జట్టులోని అందరూ మంచి ప్రదర్శన అనేది ఇవ్వడంతో గుజరాత్ మొదటి సీజన్ లోనే టైటిల్ విజేతగా నిలిచింది.
Advertisement
అయితే ఈ జట్టు విజయంలో యువ ఓపెనర్,, డ్రాఫ్ట్ పద్ధతిలో ఆ జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ ముఖ్య పాత్ర పోషించాడు అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆడిన 16 మ్యాచ్ లలో నాలుగు హర్ సెంచరీలు చేసి 483 పరుగులు చేసాడు. అయితే ఈ ప్రదర్శనతోనే భారత జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఎంపికైన గిల్.. ఇండియా తరపున కూడా అదరగొట్టాడు. కానీ అలాంటి గిల్ ను ఇప్పుడు వదిలేస్తున్నట్లు గుజరాత్ యాజమాన్యం పేర్కొంది.
Advertisement
తమ ట్విట్టర్ వేదికగా.. నీతో చేసిన ఈ ప్రయాణం అద్భుతం. ని భవిష్యత్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము అని ట్విట్ చేసింది. దాని కింద గిల్ కూడా లవ్ యూ అనే ఏమోజీతో రిప్లయ్ అనేది ఇచ్చాడు. అయితే ఈ ట్విట్స్ అనేవి చుసిన తర్వాత మొదట షాక్ అయిన అభిమానులు.. ప్రస్తుతం ఇది ఓ ప్రాంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీనిపైన టైటాన్స్ జట్టు కానీ.. గిల్ కానీ ఏ క్లారిటీ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి :