టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కే.ఎల్. రాహుల్ పై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఎల్లవేళలా ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడు అని, తన కెప్టెన్సీలో ఆడడం తనకు ఇష్టం అని పేర్కొన్నాడు. మైదానంలో రాహుల్ సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటాడు అని, తన ఫేవరేట్ కెప్టెన్ అతడే అని చెప్పాడు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ విరాట్ కోహ్లీని తప్పించిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ తరుణంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. అయితే సౌతాఫ్రికా టూర్‌కు ముందు రోహిత్ గాయపడడంతో అతని స్థానంలో వన్డే సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడు. ఈ తరుణంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడారు. నిజానికి రాహుల్ అత్యద్భుతమైన ఆటగాడు. తన కెప్టెన్సీలో ఆడడం చాలా బాగుంటుంది. జట్ట సమావేశాల్లో.. మైదానంలో ఆటగాళ్లలో తన మాటలతో ఆత్మవిశ్వాసం నిండేలా చేస్తాడు.
Advertisement
ఎల్లవేళలా అందరికీ మద్దతుగా నిలుస్తాడు. చాలా కూల్‌గా ఉంటాడు. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. నిజంగా తన సారథ్యంలో ఆడటాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. ఇంకో విషయమేమిటంటే తను నాకు బౌలింగ్ చేసే అవకాశమిచ్చాడు. ఇంతకు ముందు ఏ కెప్టెన్ కూడా ఇలా చేయలేదు. అతడే నా ఫెవరేట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో మూడవ వన్డేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రేయస్ 21 పరుగులు ఇచ్చాడు.
ఇక ఈ సిరీస్‌లో రాహుల్ నేతృత్వంలోని టీమిండియా 3-0 వైట్‌వాష్‌కు గురై ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్ విషయానికొస్తే రాహుల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కాగా.. శ్రేయస్ కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా ఎంపికయ్యాడు. మార్చి 26 నుంచి మెగా ఈవెంట్ ఆరంభం కానున్న తరుణంలో రెడ్‌బుల్ క్లబ్ హౌజ్ సెషన్‌లో శ్రేయస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసాడు.
Also Read : రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిస్తే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎమ్మెల్యే