టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్టార్ హీరోగా మారడమే కాకుండా…. ఆయన కుటుంబాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటికీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమను మెగా కుటుంబం ఏలుతుందని స్పష్టంగా చెప్పవచ్చు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి… అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలోనే… సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశాడు అల్లు రామలింగయ్య. ఎలాగైనా చిరంజీవి స్టార్ హీరోగా మారతాడని ముందే ఊహించిన అల్లు రామలింగయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి కంటే ముందు మరో స్టార్ హీరోకు సురేఖను ఇచ్చి పెళ్లి చెయ్యాలని అల్లు రామలింగయ్య నిర్ణయం తీసుకున్నాడట.
Advertisement
ఆ స్టార్ హీరో చిరంజీవి కంటే ముందే పాపులర్ అయిపోయాడట. అలాగే అతనికి ఆస్తుపాస్తులు కూడా విపరీతంగా ఉన్నాయని సమాచారం. దీంతో ఆ స్టార్ హీరోకు తన కూతురు సురేఖను కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే సురేఖ మరియు ఆ స్టార్ హీరో జాతకాలు పండితులకు చూపించారట అల్లు రామలింగయ్య. అక్కడే వీరిద్దరి పెళ్లికి బ్రేక్ పడిందని సమాచారం. వారిద్దరి జాతకాలు మ్యాచ్ కాకపోవడంతో వారి పెళ్లి క్యాన్సిల్ అయిందట. దీంతో మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి సురేఖ పెళ్లి చేశాడట అల్లు రామలింగయ్య.
ఇవి కూడా చదవండి
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం!
MS Dhoni : ఇదేం క్రేజ్ బ్రో.. ఏకంగా ట్రంప్ తోనే ధోని ఆటలు
Venu Swamy : టాలీవుడ్ లో హీరోయిన్ చనిపోబోతుంది…వేణుస్వామి సంచలనం !