విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ స్థానంలో నేను ఉండి ఉంటే అనుష్కను అసలు పెళ్లి చేసుకునే వాడిని కాదు అక్తర్ పేర్కొన్నారు. విరాట్‌ను టీమిండియా కెప్టెన్‌గా చేయడానికి తాను ఎప్పుడూ కూడా అనుకూలంగా లేనంటూ మాట్లాడాడు. గత ఆరేండ్ల కాలం నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. అతను 100-200 పరుగులు చేయడాన్ని నేను చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి. నేను అతని స్థానంలో ఉంటే.. అసలు పెళ్లి చేసుకోను. నేను కేవలం పరుగులు మాత్రమే సాధిస్తుంటాను. రాబోయే 10 సంవత్సరాల పాటు నా బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తాను. ఇది కెరీర్‌లో తిరిగి రాని చాలా ముఖ్యమైన సమయం అని చెప్పుకొచ్చాడు అక్తర్.
Advertisement
Advertisement
విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు అని అనడం లేదు. కానీ భారతదేశం కోసం ఆడుతున్న సమయంలో గర్వపడాలి. విరాట్ కోహ్లీ అంటే అభిమానులకు పిచ్చి. ఈ ప్రేమను విరాట్ 20 ఏళ్ల పాటు అదేవిధంగా కొనసాగించాలని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఆటను ప్రభావితం చేస్తుందనే విషయంపై కూడా మాట్లాడాడు. కచ్చితం ప్రభావితం చేస్తుందని, బాధ్యత పెరిగే కొద్దీ పిల్లలను పెంచడంలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఒక క్రికెటర్‌కు 15 ఏళ్ల కెరీర్ ఉంటుంది. ఇందులో కేవలం నాలుగైదు సంవత్సరాలు పీక్‌లో ఉంటారు. ఆ సమయాన్ని విరాట్ ఎప్పుడో దాటేశాడు అని చెప్పాడు షోయబ్ అక్తర్.