Home » రోహిత్.. ఇలా అయితే కష్టం..!

రోహిత్.. ఇలా అయితే కష్టం..!

by Azhar
Ad
విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి రోహిత్ శర్మ వచ్చాడు. అయితే కెప్టెన్ గా రోహిత్ రావడంతో అందరూ అతనిపైన చాలా ఆశలు అనేవి పెట్టుకున్నారు. ఎందుకంటే రోహిత్ ఐపీఎల్ లో అందరికంటే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. అందుకే రోహిత్ టీం ఇండియాకు కూడా ఐసీసీ కాపులను అందిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది.
ఆసియా కప్ లో రోహిత్ శర్మను అతని కెప్టెన్సీని చుసిన తర్వాత అందరూ.. హిట్ మ్యాన్ పైన ఉన్న ఒపీనియన్ ను మార్చుకున్నారు. గ్రౌండ్ లోనే తన కోపాన్ని ప్రదర్శించడం.. ఆటగాళ్ల మాటలు వినకపోవడం వంటివి చేస్తున్నాడు. కానీ ఈ పద్ధతి అనేది భారత జట్టుకు మంచిది కానీ అని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. రోహిత్ తీరుపైన తాజాగా అక్తర్ కామెంట్స్ చేసాడు.
ఆసియా కప్ లో రోహిత్ ను చూస్తుంటే అసలు శాంతంగా కనిపించలేదు. ఎప్పుడు అసౌకర్యంగానే కనిపిస్తున్నాడు. గ్రౌండ్ లోనే తన తోటి ఆటగాళ్ల పైన ఆరుస్తున్నాడు. అతనిలోనే కోపాన్ని చూస్తుంటే.. ఇది భారత జట్టుకు అంత మంచి చేసేదానిలా అనిపించడం లేదు. దీని వలన భారత జట్టులో నమ్మకం అనేది పోతుంది అని అక్తర్ అన్నారు. అయితే ఇవే ఆలోచనాలు సగటు భారత క్రికెట్ అభిమానికి కూడా వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు.

Advertisement

Visitors Are Also Reading