సాధారణంగా కళ్లు లేకపోతే జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఒక విద్యార్థిని మాత్రం కళ్లు లేకపోయినా పదో తరగతిలో టాపర్ గా నిలిచి అందరినీ ఆశ్యర్యపరిచారు.
Advertisement
మనలో లోపాలు ఉన్నా రేయింబవళ్లు కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధ్యమవుతుంది. పదో తరగతి పరీక్షలలో 500 మార్కులకు 470 మార్కులు సాధించి రియాశ్రీ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. హోసూర్ సమీపంలోని నెల్లూరు హై స్కూల్ లో చదివిన రియా శ్రీ పట్టుదలతో చదివి చివరకు కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.స్కూల్ టాపర్ గా నిలిచిన రియా శ్రీకి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. రియాశ్రీ తల్లీదండ్రులు హోసూర్ లోని ట్రెంట్ సిటీ ప్రాంతంలో నివశిస్తున్నారు. అఖిలన్, సుమతి దంపతుల కూతురు అయిన రియాశ్రీ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.
Advertisement
బాల్యంలోనే కంటి చూపును కోల్పోయిన రియాశ్రీ తన లోపం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు.బాల్యంలోనే రియా శ్రీ కంటిచూపును కోల్పోయినా చదువులో మేటిగా రాణిస్తూ ఆమె ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. రియా శ్రీ ప్రతిభ గురించి తెలిసి సబ్ కలెక్టర్ శరణ్య ఆమెను అభినందించారు. తన కూతురికి కంటిచూపు వచ్చేలా చేయాలని ఆమె తల్లీదండ్రులు కోరుతున్నారు. రియా శ్రీ భవిష్యత్తులో సైతం చదువు విషయంలో మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే రియా శ్రీ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రియా శ్రీ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. పట్టుదలతో కష్టపడితే విజయం దక్కుతుందని రియాశ్రీ ప్రూవ్ చేశారు.