తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాచిలర్ గా ఉన్న ఆయన ఈ మధ్యకాలంలోనే వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం చేసుకొని నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. ఇంతలో తన ఫ్యాన్స్ కు శుభవార్తను అందించాడు. తాను వివాహం చేసుకున్న రక్షిత రెడ్డి ప్రెగ్నెంట్ అయిందట. దీంతో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
అయితే రక్షిత రెడ్డి అమెరికాలో జాబ్ చేస్తుంది లాక్డౌన్ సమయంలో ఆమె ఎక్కువగా హైదరాబాదులోనే ఉంది. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఏడాది జూన్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత శర్వానంద్ సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర షూటింగ్ పూర్తి అవడంతో శర్వానంద్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. దీనికి ప్రధాన కారణం ప్రెగ్నెంట్ అయిన తన భార్య రక్షిత రెడ్డితో కొద్దిరోజులపాటు సమయం గడపాలని అందుకే ఆయన అమెరికా వెళ్లాలని చూస్తున్నారట.
Advertisement
మరో రెండు రోజుల్లోనే ఆయన అమెరికా ప్రయాణం చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సమయంలో తన భార్య పక్కన ఉంటే ఆమెకు భరోసాగా ఉంటుందని , చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని శర్వానంద్ భావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రక్షిత ఎక్కువగా అమెరికాలో ఉంటుంది కాబట్టి తనకు పుట్టే బిడ్డకు అమెరికాలోనే జన్మనివ్వాలని భావిస్తుందట. అయితే త్వరలో అమెరికాకు బయలుదేరనున్న శర్వానంద్ రెండు నుంచి నాలుగు నెలల వరకు అక్కడే ఉండబోతున్నారట. ఆ తర్వాత ఇండియాకు వచ్చి తన తదుపరి ప్రాజెక్టు మొదలు పెడతారని సమాచారం.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!