వన్డే ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 05 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించి టీమిండియాను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈసారి మాత్రం 7మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకోవడం ఖాయమైనట్టు తెలుస్తోది. 2019 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా తరపున ఆడిన 7 మంది ఆటగాళ్లకు ఈసారి చోటు దక్కలేదు. వారిలో ఓ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించగా.. మిగిలిన ఆరుగురు ఆటగాళ్లు రేసు నుంచి తప్పుకున్నారు. 2019లో ఆడిన ఆటగాళ్లు.. ఆ సారి మిస్ కాబోతున్న వారు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహేంద్ర సింగ్ ధోనీ :
Advertisement
2019లో టీమిండియాకి వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా కనిపించిన ధోనీ ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు 2023 ప్రపంచ కప్ జట్టులో ఉండడు.
శిఖర్ ధావన్ :
గత వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా తరపున 2 మ్యాచ్ లు ఆడిన ధావన్ 125 పరుగులు చేశాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్ లకు దూరం కావాల్సి వచ్చింది. 37 ఏళ్ల ధావన్ ని ఈసారి ఎంపికకు పరిగణలోకి తీసుకోరు అని స్పష్టమవుతోంది.
భువనేశ్వర్ కుమార్ :
వన్డే ప్రపంచ కప్ లో 6 మ్యాచ్ లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 10 వికెట్లు తీశాడు. అయితే ప్రస్తుతం అతనికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ జట్టులో భువనేశ్వర్ కి అవకాశం రాదనే చెప్పవచ్చు.
దినేష్ కార్తిక్ :
Advertisement
వన్డే 2019 ప్రపంచ కప్ లో 2 ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్ 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తరువాత జట్టుకు దూరమైన డీకే.. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఈసారి టీమిండియాలో దినేష్ కార్తీక్ కి అవకాశం దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.
విజయ్ శంకర్ :
2019 వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఆశ్చర్యకరమైన ఎంపికైన విజయ్ శంకర్ 3 ఇన్నింగ్స్ లో 58 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆ తరువాత జట్టు నుంచి నిస్క్రమించిన శంకర్ ఇప్పటికే టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు.
కేదార్ జాదవ్ :
వన్డే ప్రపంచ కప్ 2019లో మరో ఆశ్చర్యకరంగా ఎంపికైన ఆటగాడు కేదార్ జాదవ్. కేవలం 5 మ్యాచ్ లు ఆడిన జాదవ్ 80 మరుగులు చేశాడు. అదేవిధంగా ప్రపంచ కప్ తరువాత జాదవ్ కూడా టీమిండియా నుంచి తొలగించారు.
రిషబ్ పంత్ :
2019 వన్డే ప్రపంచ కప్ లో 4 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ మొత్తం 116 పరుగులు చేశాడు. 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ ఇంకా కోలుకోకపోవడంతో ఈసారి జట్టులో చోటు దక్కించుకోలేదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :