ఒక సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగుగడ్డ నిలిస్తే ఆ నేల గర్వించేలా ఎదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగు వారి గుండెల్లో ఈయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని ఏలికగా ఏలిన ఎన్టీఆర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఉదయం లేవగానే ఓ గంట సేపు వ్యాయామం చేసేవారు. వ్యాయామం అయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీమతి బసవతారకం పిల్లలను తీసుకొని బీచ్ కి వెళ్లి పిల్లలతో తుమ్మెద పాటలు, జానపద గేయాలు పాడిస్తూ తనూ పాడుతూ ఓ గంట సేపు అక్కడే గడిపేవారు.
Advertisement
తన కెరీర్ తొలినాళ్లలో చాలా రోజులు ఇలా చేసేవారు. ఆ తర్వాత నటుడిగా బిజీ అవడంతో బీచ్ కి వెళ్ళడం మానుకున్నారు. ఎన్టీఆర్ కి చికెన్ అంటే చాలా ఇష్టం. రోజుకు ఒక కోడిని అవలీలగా తినేవారని ఆయన ఆహారపు అలవాట్లు ఎరిగినవారు అంటూ ఉంటారు. అలాగే టీ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. అయితే తల్లి మరణం తర్వాత టీ తాగడం మానేసారు. వ్యసనాల జోలికి ఎన్టీఆర్ ఎప్పుడు వెళ్లలేదు. అయితే సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఖంగు మనే కంఠస్వరం కోసం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చుట్ట తాగేవాడు. ఆ తర్వాత కొన్నిరోజులు సిగరెట్ తాగేవాడు. క్రమంగా ఆ అలవాటు కూడా మానుకున్నాడు.
Advertisement
మొదట్లో కిళ్ళీలు వేసుకునే అలవాటు ఉండేది. కానీ ఆర్టిస్ట్ లు కిళ్ళీలు వేసుకుంటే పళ్ళు గారలు పట్టి అసహ్యంగా కనిపిస్తాయని దర్శకనిర్మాత ఎల్వి ప్రసాద్ చెప్పడంతో ఎన్టీఆర్ ఆ అలవాటును కూడా మానుకున్నారు. ఎన్టీఆర్ కి వెంకటేశ్వరస్వామి అంటే భక్తి. అందుకే ఆ భక్తి భావంతో ప్రతి శనివారం నేలమీద పడుకునేవాడు. ఆయన తల్లి గౌరీ భక్తురాలు కావడంతో ఆమె మరణం తర్వాత శివుని పట్ల భక్తి భావంతో సోమవారం కూడా నేలమీద పడుకునేవాడు ఎన్టీఆర్.నా బిడ్డలు కేవలం నా ఆస్తికి మాత్రమే వారసులు కాకూడదని, నాకు నిజమైన వారసులు గా నిలవాలని ఎన్టీఆర్ అంటూ ఉండేవారట. అందుకే వాళ్లను కూడా సినిమా రంగంలోకి తీసుకు వచ్చాడు.
ALSO READ;
తన పై సెటైరికల్ గా సినిమా చేసిన పృథ్వీ రాజ్ ఇంటికి వేస్తే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!
సుధీర్ అంటే ఆ యువతికి అంత పిచ్చా.. మరి అక్కడ పచ్చబొట్టు వేయించుకోవడం ఏంటి..?