సీనియర్ హీరోయిన్ స్నేహ అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు అంత ఫేమస్ కాకపోయినప్పటికీ.. 2000 సంవత్సరం నుంచి సినిమాలు చూసే వారికి స్నేహ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాస్, ఏవండోయ్ శ్రీవారు వంటి హిట్ సినిమాల్లో నటించింది స్నేహ. ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లో ఒకేఏడాది 7 నుంచి 8 సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేది.
Advertisement
2012లో తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తరువాత స్పీడ్ ను తగ్గించి సెలెక్టెడ్ పాత్రలను మాత్రమే చేస్తూ ఉండేది. తరువాత స్నేహ సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంది. ఛాన్స్ వచ్చినప్పుడు తల్లి, సోదరి పాత్రలు చేసేందుకు సిద్ధం అయిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ మూవీలో చరణ్ కి వదిన పాత్రలో కనిపించింది. ఇక ఈ చిత్రం కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. స్నేహను మాత్రం తెలుగు ఆడియన్స్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూశారు. దీని తరువాత ఇతర ఇండస్ట్రీల్లో స్నేహకు అవకాశాలు వచ్చాయి.
Advertisement
తాజాగా ఈ రోజు స్నేహ పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణమేంటంటే.. స్నేహ తమిళంలో మరో మూవీ చేయబోతుంది. విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబోలో Thalapathy68 అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో స్నేహ కనిపించబోతుంది. ఇవాళ పూజా కార్యక్రమం జరిగింది. స్నేహ ఈ కార్యక్రమానికి హాజరైంది. అయితే ప్రస్తుతం స్నేహకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు స్నేహ ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే స్నేహ పలు టీవీ షోలకు కూడా వచ్చింది. ఇప్పటికే స్నేహలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే Thalapathy68 మూవీ కోసమే స్నేహ ఇలా మారిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ భార్య పాత్రలో స్నేహ నటిస్తోందని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది.
మరికొన్ని సినిమా వార్తల కోసం మనం ఇక్కడ చూద్దాం.