టాలీవుడ్ అగ్రహీరోయిన్ లలో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఏప్రిల్ 14న సమంత నటించిన శాకుంతలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ.. అగ్ర హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంటుంది. పెళ్లికి ముందుకు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తరువాత కూడా విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.
Advertisement
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సమంత. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో తన విడాకుల గురించి మాట్లాడింది. తాను తప్పు ఏం చేయలేదని.. వైవాహిక బంధానికి తాను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నాను అని, తన బంధానికి తాను అంకితం అయ్యానని చెప్పింది. ఈ సమయంలో సమంత విడాకులపై స్పందించడంతో.. టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరోవైపు శోభిత, నాగచైతన్య డేటింగ్ గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత రియాక్ట్ అవ్వడం పెను సంచలనంగా మారింది. సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్ అనే చెప్పాలి.
Advertisement
కొంత మంది వీరి విడాకులకు నాగార్జున కారణమని, మరికొందరూ అమల కారణం అని, నాగచైతన్య మరో అమ్మాయితో డేటింగ్ చేయడం వల్లనే విడాకులు తీసుకున్నారని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. వీరూ కలిసి సీక్రెట్ గా లండన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఇలాంటి సమయంలో సమంత తన తప్పు ఏం లేదన్నట్టు మాట్లాడింది. దీంతో నాగచైతన్యనే విడాకులు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. చైతు పెళ్లికి ముందే శోభితతో ఎఫైర్ కొనసాగించాడని, అందుకే సమంత విడాకులు ఇచ్చింది అని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా? చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసిందండోయ్