టాలీవుడ్ లవ్లీ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్దల కారణంగా విడాకులను ప్రకటించారు. 2017లో ఈ జంట పెళ్లి చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులకు రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చయి. ముఖ్యంగా సమంత పెళ్లి తరవాత చేసిన కొన్ని సినిమాలు నాగ చైతన్యకు నచ్చకపోవడంతో విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి.
ALSO READ : పరుచూరి బ్రదర్స్ ను ఇండస్ట్రీ దూరం పెట్టింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…!
Advertisement
Advertisement
అంతే కాకుండా నాగచైతన్యనే మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని అది నచ్చకపోవడంతో సమంత విడాకులు తీసుకుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే వీరు నిజానికి ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఇదిలా ఉంటే విడాకులు ప్రకటించిన ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. నాగచైతన్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్నాడు.
అయితే ఇద్దరూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నా కూడా వీరి విడాకుల వార్తలు ఇంకా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అంతే కాకుండా మళ్లీ ఇద్దరూ కలుస్తారనే ఆశలో అభిమానులు కూడా ఉన్నారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లైఫ్ లోనే ఇద్దరూ కలిసే అవకాశం లేదని అర్థం అవుతోంది. రీసెంట్ గా సమంత తన ఫస్ట్ నైట్ కు నాగచైతన్య ఇచ్చిన ఓ గిఫ్ట్ ను రిటర్న్ చేసిందట.
ఇద్దరి ప్రేమకు గుర్తుగా నాగచైనత్య ఓ కాస్ట్లీ రింగ్ ను సమంతకు గిఫ్ట్ గా ఇచ్చాడట. రింగ్ లో ఇద్దరు పేర్లతో పాటూ లవ్ సింబల్ ఉండగా చైతూ ఎంతో ప్రేమతో ఈ గిఫ్ట్ ను సమంతకు ఇచ్చాడట. కానీ సమంత మాత్రం ఆ గిఫ్ట్ ను ఇప్పుడు తిరిగి ఇచ్చేయడంతో ఇద్దరూ కలిసే అవకాశమే లేదని స్పష్టంగా అర్థం అవుతోంది.