అక్కినేని నాగచైతన్య సమంతలు తమ వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న నాటినుండి సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ విడాకులపై ఇన్ డైరెక్ట్ గా ఈ పోస్టులు పెడతా ఉంది.
Advertisement
అంతేకాకుండా టీవీ ఛానల్స్ కు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆసక్తికర కామెంట్లు చేస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఒకే ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కాని తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ లు చేశాడు. దాంతో చైతూ ఆ కామెంట్లను సమంతను ఉద్దేశించే చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
ఇంటర్వ్యూ లో యాంకర్ చైతూను మీరు ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు అంటూ ప్రశ్నించాడు. దానికి నాగ చైతన్య సమాధానమిస్తూ… నేను అన్ని రకాల సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. కానీ నేను చేసే పాత్ర కారణంగా మా కుటుంబం మాత్రం ఇబ్బంది పడకూడదు. ఏ విషయంలో అయినా నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ పాత్ర చేయనని చెప్పేస్తాను. నా కుటుంబం పై ప్రభావం చూపే పాత్రను అస్సలు చేయను అంటూ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నాగ చైతన్య ఈ కామెంట్లు సమంతనే ఉద్దేశించి అన్నారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య విడిపోయిన సమయంలో విడాకులకు కారణం సమంతనే అంటూ పలువురు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
సమంత ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించడం వల్లే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తుతాయని కూడా వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పుడు కూడా నాగ చైతన్య ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్లు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక నాగ చైతన్య ప్రస్తుతం తన సినిమాలతో బిజీ అవగా సమంత కూడా తన చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా రీసెంట్ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి సమంత అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ పాట లో లిరిక్స్ కూడా చైతూ ను ఉద్దేశించే అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read:ఆర్ఆర్లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా..?