Home » సినిమాలకు గుడ్ బై చెప్పి… నాగార్జున కి పోటీగా ఆ పని చేయబోతున్న సమంత..!!

సినిమాలకు గుడ్ బై చెప్పి… నాగార్జున కి పోటీగా ఆ పని చేయబోతున్న సమంత..!!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒక్కరిని తన  మాయలో పడేసింది ఈ అందాల భామ. ఇక ఆ సినిమా అనంతరం ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సమంత సినిమాలలో నటిస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక కొన్ని రోజులకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు అనంతరం సమంత తీవ్రమైన అనారోగ్యానికి గురైంది.

Advertisement

తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఇక ఆ వ్యాధికి చికిత్స తీసుకున్నప్పటికీ సమంత కోలుకోలేకపోయింది. ఇక కొన్ని కోట్లు ఖర్చు చేసి ట్రీట్మెంట్ కోసం తాజాగా సమంత అమెరికాకు వెళ్ళింది. ఇక అమెరికాలో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఏడాదిపాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అంతకుముందు సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేసింది. ఇక ఖుషి సినిమా సక్సెస్ కావడంతో సమంత చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కి సమంత వెళ్లడం లేదు. ప్రస్తుతం సమంత అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో తాను అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా సమంత షేర్ చేస్తుంది.

Advertisement

ఇక ఈ ఫోటోలను చూసిన చాలామంది సమంత నిజంగానే ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్లిందా, లేదంటే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందా అని డైనమాలో పడిపోయారు. సంతోషంగా ఉంటే ఎలాంటి వ్యాధినైనా తరిమికొట్టొచ్చు అని డాక్టర్లు చెబుతారు. అందువల్లనే సమంత దీనిని ఫాలో అయినట్టు తెలుస్తోంది. సమంత అమెరికాలో ట్రీట్మెంట్ తో పాటు వెకేషన్ మోడ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా గడుపుతోంది. ఇక మునుపటి కంటే ఇప్పుడు చాలా సంతోషంగా, యాక్టివ్ గా కనిపిస్తోంది సమంత. ఏది ఏమైనాప్పటికీ సమంత కోలుకొని చాలా యాక్టివ్ గా ఉండి మళ్లీ సినిమాలలో నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి… నాగార్జున లాగా బిజినెస్ లు మాత్రమే చేయాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సమంత… ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading