టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దంగా ఉంది. సినిమా విడుదల నేపథ్యంలో సమంత చిత్ర యూనిట్ తో కలిసి సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు టీవీ ఇంటర్వ్యూలలో సమంత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
Advertisement
సమంతకు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా అయితే ఆరోగ్యం గురించి లేదంటే విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఆ ప్రశ్నలను దాటవేసేందుకు సమంత ఎంతో ప్రయత్నిస్తోంది. ఇక మరికొన్ని సార్లు నోరు జారి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాక్యలు చేసింది. నా జీవితంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని నా జీవితం తెరిచిన పుస్తకం అంటూ సమంత వ్యాక్యానించింది. ఎత్తుపల్లాలను పారదర్శకంగా అందరూ చూపించవచ్చు.
Advertisement
కానీ కొందరి లో ఫేక్ గా ఉండటం..విషయాలను దాచిపెట్టడం నచ్చవు నేను అలా ఉండలేను అంటూ సమంత వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యను ఉద్దేశించే ఆ కామెంట్ లు చేసిదంటూ నెట్టింట కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో సమంత నాగచైతన్య విడాకుల సమయంలో చైతూ మరో అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలోనే సమంత ప్రస్తుత కామెంట్ లు చేసిందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.
ALSO READ :ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్ కి సిద్ధమైన హిట్ మూవీ..!