టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు హీరోల రేంజ్ లో అభిమానులు ఉన్నారు. సమంత ఏమ్మాయ చేసావే సినిమా తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే కుర్రాళ్లను తన మాయలో పడేసింది. ఆ తరవాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు అందుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలా దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ జోడీ కట్టింది.
Advertisement
ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే హీరో నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్ళైన కొన్నెళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయ్యారు. కాగా సినిమాల్లో బిజీ అయ్యే టైమ్ లో సమంత అనారోగ్యానికి గురయ్యింది. ఆ తరవాత చాలా స్ట్రగుల్ అయ్యింది.
Advertisement
కాగా జనవరిలో తన జీవితం లో జరిగిన అనుభవాలను సమంత ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. ఆ వీడియో లో సిటాడెల్ సినిమాకి సంబందించిన ఫోటోలు మరియు జిమ్ చేస్తున్న ఫోటోలు ఉన్నాయి. ఇక ఆ పోస్ట్ కు సమంత ఇచ్చిన క్యాప్షన్ చాలా ఎమోషనల్ గా కనిపిస్తుంది.
గట్టిగా ఊపిరి పీల్చు పాప. అన్నీ సర్దుకుంటాయి. గత కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డావు. ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డావు ఎప్పటికీ గుర్తు పెట్టుకో….ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా అడుగు వేశావు. నేను దానికి గర్వంగా ఉన్నా…ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగిపో….అంటూ సమంత తన క్యాప్షన్ లో పేర్కొంది.