Home » SALAAR : 80 కోట్ల‌తో క్లైమాక్స్…స‌లార్ = 10 కేజీఎఫ్…!

SALAAR : 80 కోట్ల‌తో క్లైమాక్స్…స‌లార్ = 10 కేజీఎఫ్…!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా స‌లార్. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శలో ఉంది. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఈ చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక శృతి బర్త్ డే సంధ‌ర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి స‌ర్ప్రైజ్ చేయ‌గా ఆ పోస్ట‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

salar kgf

Advertisement

ఇదిలా ఉంటే ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ప్ర‌శాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ కాంబోలో సినిమా అన‌గానే అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్త‌లు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్కుర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలోని ముఖ్య‌మైన కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెలంగాణ‌లోని గోదావ‌రిఖ‌ని బొగ్గుగ‌నుల్లో తెర‌కెక్కించారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజా టాలీవుడ్ టాక్ ప్ర‌కారం ఈ సినిమా క్లైమాక్స్ స‌న్నివేశం కోసం ఏకంగా రూ.80 కోట్ల ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ప్ర‌భాస్ రా అండ్ ర‌స్టిక్ గా కనిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ స‌లార్ సినిమాలో తన క్యారెక్ట‌ర్ తో ఓ మ్యాజిక్ ను క్రియేట్ చేయ‌బోతున్నార‌ట‌. సినిమాలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలతో పాటూ కంట‌త‌డి పెట్టించే ఎమోష‌నల్ సీన్లు ఉండ‌బోతున్నాయ‌ట‌.

salar sruthi hasan

salaar sruthi hasan

మిలిట‌రీ ట్యాంకులు, జీపులు, భారీ తుపాకులు, యుద్ద విమానాల‌ను ఈ సినిమా షూటింగ్ కు ఉప‌యోగించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా అంచనాల‌కు మించి పోతుంద‌ని ప‌ది కేజీఎఫ్ ల‌తో స‌మానంగా ఉంటుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి స‌లార్ ఆ అంచనాల‌ను రీచ్ అవుతుందా లేదా చూడాలి.

ALSO READ : SUNITA RAM : దానికి భేష‌రుతుగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా…సింగ‌ర్ సునిత భ‌ర్త‌…!

Visitors Are Also Reading