టాలీవుడ్ ప్రముఖ గాయని సింగర్ సునిత మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. అయితే రీసెంట్ మాంగో రామ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రామ్ తన మాంగో యూట్యూబ్ ఛానల్ లో సినిమాలను కొనుగొనుగోలు చేసి ప్రసారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమాను తమ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారు.
Sunita ram
అయితే అందులోని కొన్ని సన్నివేశాలు గౌడ కులస్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ కొంతమంది మాంగో రామ్ ఆఫీసుపై దాడి చేశారు. మాంగో రామ్ తో వివాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ ఘటన పై మాంగో రామ్ వివరణ ఇచ్చారు. ఈ నెల 24 గౌడ కులానికి చెందిన వారమంటూ కొంత మంది వచ్చి ఆఫీసుపై దాడి చేశారు.
Advertisement
Advertisement
సినిమాలోని వీడియో క్లిప్లింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే దానిని తొలగించాము. స్త్రీలను కించపర్చడం మా ఉద్దేశ్యం కాదు. కాబట్టి వెంటనే ఆ వీడియోను తొలగించాము. నిజానికి ఆ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి వచ్చింది.
ఆ తరవాతనే మేము సినిమాను కొనుగోలు చేసి యూట్యూబ్ విడుదల చేశాం. వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే దానిని తొలగించాము. అయినప్పటికీ ఎవరినైనా నొప్పించి ఉంటే వారికి నేను భేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. అంటూ రామ్ పేర్కొన్నారు.