ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా లక్ష్మి పార్వతి ని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి. ఇవాళ సజ్జల రామ కృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుకు సొంత గుర్తింపు లేదని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు , పార్టీ వాడుకున్నారని… చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ జోకర్ కి తక్కువ అంటూ చురకలు అంటించారు.
Advertisement
చంద్రబాబు గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు జోక్ చేస్తున్నారని… పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు ఊహాగానాలు లేకుంటే లోకేష్ పాదయాత్ర కు క్యాడర్ రారని చురకలు అంటించారు. చంద్రబాబు కి దేని మీదా నమ్మకం లేదని.. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు జేపీ నడ్డా తో ఒంగి ఒంగి నంగిగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తిట్టి, గంటలో కాళ్ళు పట్టుకో గలడు…మోడీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గతంలో తిట్టారని గుర్తు చేశారు సజ్జల రామ కృష్ణ రెడ్డి. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని.. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి ఘోషిస్తుందని మండిపడ్డారు.
Advertisement
చంద్రబాబు ఏజెంట్ గా పురంధరేశ్వరి పని చేస్తున్నారు… లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ లక్షల మంది ముందు పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి ని ఎన్టీఆర్ ధర్మపత్నీగా ప్రజలు ఒప్పుకున్నారు….ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా లక్ష్మి పార్వతి ని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని ఆగ్రహించారు సజ్జల రామ కృష్ణ రెడ్డి. బీజేపీ, చంద్రబాబుని కలపడానికే పురంధరేశ్వరి ని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టారు…బీజేపీ, టీడీపీ కలపాలని అనుకుంటే ఎవరు అపుతారు.? అని నిలదీశారు. చంద్రబాబు భావజాలం అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటూ మండిపడ్డారు సజ్జల రామ కృష్ణ రెడ్డి.
ఇవి కూడా చదవండి
Mannara Chopra : డైరెక్టర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు
Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?
ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?