ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో టికెట్ల ధరలను భారీగా పంచగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా తగ్గించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల పై ఆంక్షలు విధించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించని థియేటర్లపై కొరడా విసురుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు టిక్కెట్ల ధరల పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. కొంతమంది సినిమా టికెట్ల ధరలను పెంచాలని వాదిస్తుంటే మరికొంతమంది మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండాలంటూ మాట్లాడటం విశేషం.
Advertisement
Advertisement
తాజాగా నటుడు సాయికుమార్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. సాయి కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు. తిరుమల అధికారులు స్వామివారి వస్త్రంతో సాయి కుమార్ ను సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ…. ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. వేషం వేసుకుని మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిందని సాయి కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం పలు భాషల్లో వివిధ సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.
Also read :తీవ్ర అనారోగ్యంతో ఇళయరాజా…ఈ వీడియోతో క్లారిటీ..!
సినిమా విడుదలపై ప్రభుత్వం కమిటీని వేసిందని కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. అందరికీ అందుబాటులో టిక్కెట్ల ధరలు ఉండాలని అతి తొందరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని సాయికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా నాని ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు కిరాణా కొట్టు కంటే దారుణంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీ నుండే ఒక్కక్కరూ ఒక్కోలా మాట్లాడటం తో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.