మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. మనం ఇందులో ఎక్కువగా రుద్రాక్ష ధరించే వాళ్ళంటే పూజారులు, ఇతర శాస్త్రాలు తెలిసిన వారి మెడలో చూస్తాం. మరి రుద్రాక్షలు ధరించేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. రుద్రాక్ష ధరించడం వల్ల మానసికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దవారు అంటున్నారు. రుద్రుడు నుంచి రాలిన కన్నీటి చుక్కలు రుద్రాక్షలు గా మారాయని ప్రజలు నమ్ముతున్నారు. శివుని ప్రతిరూపాలుగా చాలామంది రుద్రాక్షలను కొలుస్తారు.
also read:తమన్నాతో డేటింగ్ పై విజయ్ వర్మ ఏమన్నారో తెలుసా ?
నిత్యజీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నవారు రుద్రాక్షలు ధరించడం మంచిది. కానీ రుద్రాక్ష ధరించినప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. రుద్రాక్ష వృక్షాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండడంతో పాటు ఈ వృక్షాలు చాలా ఖరీదైనవి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే రుద్రాక్ష మాలలు ధరిస్తారో అలాంటివారు మైల పడిన వాళ్లను తాకకూడదు. అలాగే రుతుక్రమంలో ఉన్న స్త్రీలు కూడా ఈ రుద్రాక్షకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఒకరు వాడిన రుద్రాక్ష మరొకరు ఉపయోగించరాదు.
also read:అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
ఎవరైతే రుద్రాక్ష మాలను ధరిస్తారో అలాంటివారు స్మశానానికి వెళ్లకూడదు. ఏకముఖి రుద్రాక్షలను ధరించిన వారిపై దుష్టశక్తుల ప్రభావం ఉండదు. అంతేకాకుండా రుద్రాక్షలు ధరిస్తే ఆర్థిక స్తిరత్వం పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మానసిక,దీర్ఘకాలిక వ్యాధులకు ఎంతగానో ఉపయోగపడతాయని వేద పండితులు అంటున్నారు. రుద్రాక్షలను పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి.
also read: