Home » రూ.2వేల నోటు రద్దు.. కొత్త కాయిన్ తెస్తున్న కేంద్ర సర్కార్..!!

రూ.2వేల నోటు రద్దు.. కొత్త కాయిన్ తెస్తున్న కేంద్ర సర్కార్..!!

by Sravanthi
Ad

కేంద్ర ప్రభుత్వం ఆర్.బి.ఐ నిబంధనలతో 2000 నోటును రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఒక కాయిన్ కూడా తీసుకొస్తుందట. అదేంటో పూర్తి వివరాలు చూద్దామా. మే 28న దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం జరగబోతోంది. అదే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. అంతేకాకుండా ఇదే రోజున రాజదండనం కూడా లోకసభలో ప్రతిష్టించబోతోంది.ఇంకా ఆరోజులో మరో స్పెషల్ కూడా జరగబోతుంది.

Advertisement

అదేరోజు 75 రూపాయల కొత్త నాణాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఈ విషయాన్ని తెలియజేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఈరోజునే నాణెం కూడా ఆవిష్కరిస్తారు. అయితే ఈ కొత్త నాణానికి ఒక వైపు మూడు సింహాల చిహ్నం, మధ్యలో అశోక స్తంభం దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది.

Advertisement

అలాగే ఎడమ అంచు వైపున దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి అంచు వైపున ఇంగ్లీషులో ఇండియా అని రాసి ఉంటుంది. ఇంకా ఈ నాణెం పై రూపీ సింబల్ డినామినేషన్ వ్యాల్యూగా 75 సంఖ్య. సింహాల సింబల్ కింద ఉంటుంది. ఈ నాణానికి మరొకవైపు పార్లమెంటు భవనం ముద్ర, దీనిపైన సంసద్ సంకుల్ అని దేవా నాగరి లిపిలో పైన రాసి ఉంటుంది. అలాగే పార్లమెంట్ కాంప్లెక్స్ అని కింద రాసి ఉంటుంది. ఇంకా భవనం ముద్ర కింద 2023 అని రాసి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిసింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading