గత కొన్ని రోజులుగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డు అందరి కళ్ళలో ఆనందాన్ని నింపిందని చెప్పవచ్చు. అందరూ అనుకున్నట్టుగానే RRR మూవీలోని నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు సొంతం చేసుకొని చరిత్ర క్రియేట్ చేసింది. ఇది భారతీయ సినీ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టంగా చెప్పుకోవచ్చు. భారత సినీ చరిత్రలోనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల జక్కన్న సహకారం చేశారని చెప్పవచ్చు.
Advertisement
Also Read:సమంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో వైరల్..!
లాస్ ఏంజెల్స్ వేదికగా 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా పోటీపడిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో. “నాటు నాటు” ఎంపికై అవార్డు గెలుసుకోవడం ఆనందదాయకం. ఈ నాటు నాటు పాట ప్రపంచంలోనే ఎంతో మంది ప్రేక్షకులను డాన్స్ ఆడించింది. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ను చంద్ర బోస్ రాయగా రాహుల్ సిబ్లిగంజ్, కాలభైరవ వారి గానంతో అదరగొట్టేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మరో లెవల్లో నిలబెట్టిందని చెప్పవచ్చు.
Advertisement
Also Read:నాగార్జున సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణం…ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే..?
ఈ పాట బయటకు వచ్చినప్పటి నుంచి ఆస్కార్ నామినేషన్ లో ఎంపికై అవార్డు గెలుచుకునే వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలవడంతో , మరోసారి ఆస్కార్ అవార్డును కూడా అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ప్రపంచ స్థాయిలో గుర్తుండేలా చేసిందని చెప్పవచ్చు. ఇంతటి ఘనతకు కారణం జక్కన్నతో పాటుగా చిత్ర టీం వర్క్ అని చెప్పవచ్చు. ఈ అవార్డు రావడంతో దేశంలోని ప్రముఖులు మరియు సినీ నటులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read:కృష్ణ కాలర్ పట్టుకున్న నాగార్జున…భగ్గుమన్న కృష్ణ ఫ్యాన్స్ చివరికి ఏం చేశారంటే..?