ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ అనూహ్యంగా వాయిదా పడటంతో పెద్ద నష్టాన్నే మూటగట్టుకున్నది. విడుదలకు ముందే రాజమౌళి సినిమాకు నష్టం కలిగింది.
Advertisement
టాలీవుడ్ నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే కాస్త నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి జనవరి 07న విడుదలవ్వాల్సి ఉండగా..కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు, నైట్ కర్ప్యూలు అమలులో ఉండడంతో సినిమాను వాయిదా వేశారు.
Advertisement
ఈ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించింది. ముంబై, చెన్నైనగరాలతో పాటు బిగ్‌బాస్, కపిల్‌శర్మ షోలలో ప్రమోషన్స్ నిర్వహించాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగానే నిర్వహించింది టీమ్. ఈ వేడుకకోసం చప్పట్లు కొట్టేందుకు, ఛీర్స్ విజిల్స్ చేసేందుకు మీడియా మార్కెటింగ్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఇప్పటివరకు ప్రమోషన్ల నిమిత్తం దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. అదంతా బూడిదలో పోసిన పన్నేరే. మరొకవైపు ఓవర్సిస్లో టికెట్లు అన్ని అమ్మేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దాదాపు 9 కోట్లు ఖర్చు అయిందట. ఈ వెంట్ ప్రసార హక్కుల్ని జీ టీవీ సొంతం చేసుకుంది. ఆ రూపంలో రూ.9కోట్లు తిరిగి వచ్చేసినట్టే లేదంటే ప్రమోషన్లలో మరొక 9 కోట్లు నష్టపోవాల్సి వచ్చేది.