టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ మల్టీ స్టారర్ చిత్రం గత నెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్, సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. అన్నదమ్ములుగా నటించడంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
ఆర్ఆర్ఆర్ కు వైరస్ నుంచి పెద్ద షాకే అయింది అని చెప్పాలి. పాన్ ఇండియా చిత్రం విడుదలై రెండు వారాలు కూడా పూర్తికాకముందే యూట్యూబ్ లో లీక్ అయింది. ఇంటర్నెట్లోని లీకుల అంశం కన్నా.. ఏకంగా యూట్యూబ్లో ఆర్ ఆర్ ఫుల్ హెచ్డీ మూవీ లీక్ అవ్వడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఛానల్ లో లీక్ లీక్ అయిందో తెలియజేస్తూ ట్విట్టర్లో స్క్రీన్షట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ మూవీ మేకర్స్ కు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఈ లీకుల పర్వాన్ని ఆపాలని అభిమానులు కోరుతున్నారు.
Advertisement
Advertisement
మరొకవైపు సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని హైలెట్ సీన్స్ వీడియో క్లిప్ ల రూపంలో యూట్యూబ్ లోకి వచ్చి చేరాయి. కొన్ని ఛానళ్లలో ఆర్.ఆర్ ఆర్ ఫైట్ సీన్స్ వీడియో లు ఉండడం పట్ల అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో జక్కన్న దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో క్లైమాక్స్ సీన్ లీక్ అయిన విషయం తెలిసినదే. ఇక ఆర్ ఆర్ ర్ లీక్ పై మూవీ మేకర్స్ ఇప్పటివరకు అంతర్గతంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.