ఈ మధ్యకాలంలో కిరాక్ ఆర్పి పెట్టిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఆ హోటల్లో అన్ని రకాల చేపలతో పులుసు లభిస్తోంది. ఇంతవరకు హైదరాబాదులో ఇలాంటి చేపల పులుసు హోటల్ ఎక్కడ కూడా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ హోటల్ ద్వారా ఆర్పీ బాగానే సంపాదిస్తున్నారని సమాచారం . పెట్టిన కొద్దిరోజుల్లోనే చాలా డెవలప్ అవడంతో కస్టమర్ల తాకిడి కూడా పెరిగిపోయింది. ప్లానింగ్ సరిగా లేకపోవడంతో చెఫ్ ల కొరత ఏర్పడుతోందట.
Advertisement
దీంతో హోటల్ ను కొన్నాళ్లు మూసేశారు. ఆ తర్వాత నెల్లూరుకు వెళ్లి అక్కడ చేపల పులుసు వండడంలో చేయి తిరిగిన వారిని తీసుకొని వచ్చి మళ్లీ రీ ఓపెన్ చేశాడు ఆర్పి. డిమాండ్ కు తగ్గట్టుగా ఆ కిచెన్ కెపాసిటీని కూడా పెంచేశారట. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఈ బ్రాంచ్ నడుస్తోంది. జనాలు కూడా అక్కడికి బాగానే వెళ్తున్నారట. నెల్లూరు స్టైల్ లో మామిడికాయ వేసి పులుసు చేస్తున్నాడు ఆర్పి. చేపలు కూడా దాదాపుగా అక్కడి నుంచే తెప్పిస్తున్నాడట. సన్న చేపల పులుసు బొమ్మిడాల పులుసు, కోరమీను పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు అతని వద్ద అందుబాటులో ఉంటున్నాయి.
Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అర్పి చేపల పులుసు ట్రేడింగ్ గా మారింది. ఈ తరుణంలోనే మరో విషయం బయటకు వచ్చింది. అర్పి పెట్టిన చేపల పులుసు బిజినెస్ గట్టిగానే సాగుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో అర్పి ఇంకా బ్రాంచ్ లు ఓపెన్ చేసే పనిలో పడ్డారట. ఇవన్నీ విషయాలు రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ ఆ ఒక్క విషయం ఎవరికీ తెలియదు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్లో ధరలు ఎంత ఉన్నాయో అందరికీ తెలియదు. ఆ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వైట్ రైస్–75 రూపాయలు
రాగి సంగటి–100 రూపాయలు
చేప తలకాయ పులుసు –200 రూపాయలు
సన్న చేపల పులుసు 250 రూపాయలు
రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు
బొమ్మిడాయిల పులుసు–375 రూపాయలు
కొరమేను పులుసు –375 రూపాయలు.
also read: