Home » Rowdy Boys: రౌడీ బాయ్స్ లో ఈ సీన్ గ‌మ‌నించారా..? మ‌క్కీ టూ మ‌క్కీ ఆ సినిమా నుండి దింపేశాడుగా..!

Rowdy Boys: రౌడీ బాయ్స్ లో ఈ సీన్ గ‌మ‌నించారా..? మ‌క్కీ టూ మ‌క్కీ ఆ సినిమా నుండి దింపేశాడుగా..!

by AJAY
Ad

హాలీవుడ్ సినిమాల నుండి కొరియన్ సినిమాల నుండి సీన్ల‌ను ద‌ర్శ‌కులు కాపీ కొట్ట‌డం సాధార‌ణ‌మే. అప్ప‌టి వ‌ర‌కూ ఆ సీన్ల‌ను ప్రేక్ష‌కుడు చూసి ఉండ‌రు కాబ‌ట్టి ప‌ర్వాలేదులే అనుకుంటాడు. ఇక ఇండియాలోనే ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన సినిమాల నుండి సీన్ల‌ను కాపీ కొడితే ద‌ర్శ‌కుడికి కాపీ డైరెక్ట‌ర్ అని ముద్ర ప‌డిపోతుంది. మ‌రి తెలుగు సినిమాలోని సీన్ల‌నే కాపీ కొడితే ఆ ద‌ర్శ‌కుడిని ఏమ‌ని పిల‌వాలి….అది కూడా ఓ సూప‌ర్ హిట్ సినిమాలోని సూప‌ర్ హిట్ సీన్ ను కాపీ కొడితే ఏమ‌నుకోవాలి. తాజాగా అదే జ‌రిగింది.

Advertisement

దిల్ రాజు న‌ట‌వార‌సుడిగా ఆయ‌న సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. దిల్ రాజు త‌న సొంత బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ సినిమాలో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా అనుప‌మ ఈ సినిమాలో మునుప్పెన్న‌డూ లేన‌ట్టుగా రెచ్చిపోయింది. ఏకంగా ముద్దు సీన్ల‌కు సైతం ఒప్పేసుకుంది.

Advertisement

Rowdy boys

Rowdy boys

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ సీన్ ను ద‌ర్శ‌కుడు మ‌రో సూప‌ర్ హిట్ తెలుగు సినిమా నుండి కాపీ కొట్ట‌డంతో నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ మ‌రో ఏరియాకు హీరోయిన్ కు లైటింగ్ కొట్ట‌డానికి వెళ్ల‌గా అక్క‌డే ఉన్న ఒక బ్యాచ్ మీ ఏరియాలో ఆడోళ్లు లేరో మా ఏరియాకు వ‌చ్చారు అంటూ కామెంట్ చేస్తాడు.

దాంతో వ‌రుణ్ తేజ్ మా ఏరియాలో ఆడాళ్లు ఉన్నారు. మీ ఏరియాలోనే మ‌గాళ్లు లేరంటే వ‌చ్చామంటూ పంచ్ వేస్తాడు. అయితే ఇదే డైలాగ్ ను రౌడీ బాయ్స్ లో కాపీ కొట్టారు. ఏరియా స్థానంలో కాలేజ్ పెట్టాడు అంతే. హీరో వేరే కాలేజీ కి అమ్మాయి కోసం వెళ్ల‌గా మీ కాలేజీలో అమ్మాయిలు లేరా మా కాలేజీకి వ‌చ్చారంటూ అడ‌గ్గా….మా కాలేజీలో అమ్మాయిలు ఉన్నారు. మీ కాలేజీలోనే మ‌గాళ్లు లేర‌ని మేం వ‌చ్చామంటూ పంచ్ వేస్తాడు.

also read : మ‌హేష్, ర‌వితేజల‌ కొడుకులు ఈ సినిమాల్లో న‌టించార‌ని మీకు తెలుసా?

Visitors Are Also Reading