పోర్చుగల్ స్టార్ ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఇంట వంట మనిషి అవసరమయ్యాడట. కొన్ని కాలం క్రితం నుంచి రోనాల్డో తన కుటుంబానికి వండి పెట్టేందుకుగాను ఒక మాస్టర్ చెఫ్ కావాలని చాలా కాలం నుంచి వెతుకుతున్న, సరైన నిపుణుడు దొరకడం లేదని రోనాల్డో తెగ భాదపడుతున్నాడట. పోర్చుగల్ లోని క్వింటాడాలో రోనాల్డో సుమారు రూ.170 కోట్లతో అన్ని హంగులతో ఓ భవనాన్ని కట్టిస్తున్నాడు. 2023 జూన్ వరకు ఆ ఇంటి నిర్మాణం పూర్తి కానుంది. రిటైర్మెంట్ తర్వాత తన పార్ట్నర్ జార్జినా, నలుగురు పిల్లలతో కలిసి రోనాల్డో అక్కడే ఉండనున్నాడు.
Advertisement
అయితే ఈ ఇంట్లో తనకు కావాల్సిన వంటకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని వంటలు తెలిసిన మాస్టర్ చెఫ్ కోసం రోనాల్డో చాలా కాలంగా వెతుకుతున్నాడు. వంట మనిషికి సుమారు 4,500 పౌండ్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.4.5 లక్షల ఇస్తానని చెప్పిన ఎవరు ముందుకు రావడం లేదట. మరి జూన్ వరకైనా రోనాల్డోకు సకల వంటలు తెలిసిన చెఫ్ దొరుకుతాడో లేదో చూడాలి. ఇక ఫిఫా ప్రపంచ కప్ లో క్వార్టర్స్ లోనే పోర్చుగల్ ఇంటి ముఖం పట్టిన రోనాల్డోకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
Advertisement
రోనాల్డోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని సౌదీ అరేబియాకు చెందిన ఆల్ నజర్ జట్టు భారీగా వెచ్చించి సొంతం చేసుకుంది. రెండున్నర ఏళ్లకు గాను సుమారు రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కొద్దికాలం క్రితమే సౌదీలో ల్యాండ్ అయ్యి ప్రస్తుతం కుటుంబంతోపాటు అక్కడే ఉంటున్నారు రోనాల్డో. జనవరి 22 నుంచి ఆల్ నజర్ తరఫున ఆడనున్నారు. ఈ ఏడాది మే వరకు రోనాల్డో సౌదీలోనే ఉంటారు. ఆ తర్వాత పోర్చుగల్ కు వెళ్తాడు. అప్పటివరకు పోర్చుగల్ లో తన కొత్త ఇంటిని రెడీ చేసుకుని చెఫ్ ను కూడా రెడీ చేసుకోవాలని రోనాల్డో భావిస్తున్నారట.
READ ALSO : కలలో చనిపోయిన పూర్వీకులు కనిపిస్తున్నారా, కోటీశ్వరులు అవుతారా!