ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీల నేతలపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తాను ఒంగోలు నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఏపీ మంత్రి రోజా. నగరిలో ఉన్న తాను ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారామె. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతితప్పి మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు రోజా. పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వారు ఏపీకి వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా.
Advertisement
Advertisement
వైఎస్ షర్మిల మాటలకు విలువే లేదన్నారు. షర్మిల వేషం కాంగ్రెస్ ది, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ సెటైర్లు వేశారు మంత్రి రోజా. ‘నేను ఏ రోజు అయినా ఒక తప్పు చేశాననో, ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నాననో ప్రూవ్ చేయమనండి. 24 ఏళ్ల తర్వాత నేను పదవులు అమ్ముకుంటున్నట్లు ఆయన కనిపిస్తోంది. ఎవరికో లొంగి నా మీద నింద వేస్తే కచ్చితంగా భగవంతుడు సమాధానం చెబుతాడు. నగరి నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు.
చంద్రబాబు మాట్లాడే మాటలు ఆయన ప్రస్టేషన్ కు ప్రతీక. అలాగే, ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు’ అని మంత్రి రోజా ఫైర్ అయ్యారు.