Home » రోహిత్ కోపానికి కారణం ఏంటో తెలుసా..?

రోహిత్ కోపానికి కారణం ఏంటో తెలుసా..?

by Azhar
Ad

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో రోహిత్ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ప్రవర్తన అనేది వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న ఒక్కనొక సమయంలో రోహిత్.. వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తీక్ యొక్క తలను పట్టుకొని.. గట్టిగ నొక్కుతూ సీరియస్ గా అతనితో ఏమో చెబుతున్నట్లు కనిపించాడు.

Advertisement

అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో అందరూ రోహిత్ పైన సీరియస్ అవుతున్నారు. కానీ రోహిత్ కు ఎందుకు కోపం వచ్చిందో మాత్రం అర్ధం కావడం లేదు. అయితే ఈ మ్యాచ్ లో గ్లేన్ మ్యాక్వెల్ ఆడిన ఓ బంతి బ్యాట్ ను తాకి.. కీపర్ అయిన కార్తీక్ చేతిలోకి వెళ్ళిపడింది.

Advertisement

దాంతో మన జట్టు మొత్తం ఔట్ అంటూ అప్పీల్ చేసారు. కానీ స్వయంగా కార్తీక్ సైలెంట్ గా ఉన్నాడు. ఇక అంపైర్ కూడా ఔట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ రోహిత్.. రివ్యూకి వెళ్ళాడు. అపుడు అది ఔట్ అని నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాతే నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటూ రోహిత్ కార్తీక్ పైలా అలా రియాక్ట్ అయ్యాడు. కానీ అది ఫన్నీగానే. రోహిత్ తన తల పట్టుకున్న సమయంలో కూడా కార్తీక్ నవ్వుతు ఉండటమే దానికి నిదర్శనం.

ఇవి కూడా చదవండి :

తన తప్పును జట్టు మొత్తం మీద నెడుతున్న రాహుల్..?

బుమ్రా ఫిట్ గా లేడా.. ఫ్యాన్స్ ఆగ్రహం..!

Visitors Are Also Reading