భారత్ ఖాతాలో మరొక స్వీప్.. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ముఖ్యంగా టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (73 నాటౌట్ ) చెలరేగడంతో ఆదివారం చివరిదైన మూడవ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read : భీమ్లానాయక్ డైరెక్టర్ కు బ్యాగ్రౌండ్ ఏంటి..? పవర్ స్టార్ ఎలా అవకాశం ఇచ్చారు…!
Advertisement
శ్రీలంకతో జరిగిన మూడవ, చివరి టీ20లో విజయం సాధించిన తరువాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని అందుకోవడానికి వెళ్లాడు. అతను దానిని 3 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రతినిధి జయదేవ్ షాకు అందజేశాడు. జయదేవ్ సౌరాష్ట్ర మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ కార్యదర్శి మరియు క్రికెటర్ నిరంజన్ షా కుమారుడు. అతను 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
Advertisement
ముఖ్యంగా 29.91 సగటుతో 5354 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 20 అర్దసెంచరీలు ఉన్నాయి. జయదేవ్ ప్రస్తుతం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలి, సెక్రెటరీ జయ్ షాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సిరీస్‌కు ముందు TOI కి చెప్పాడు.
Also Read : 28th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!