ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో వరుసగా రికార్డులు నమోదు అవుతున్నాయి. నిన్న 13 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించిన యశస్వి జైస్వాల్ గురించి మరిచిపోక ముందే తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ (103) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 29 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ముంబై తరుపున 200 సిక్సర్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.
అదేవిధంగా ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ ప్రారంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన రోహిత్ శర్మ మూడు సీజన్ల తరువాత 2011 ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి ముంబై తరుపున ఆడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్ గా 5 సార్లు ముంబైని టోర్నీ ఛాంపియన్ గా నిలిపాడు. నేటి మ్యాచ్ లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు అంతకుముందు ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (251) పేరిట ఉండేది. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం 252 సిక్స్ లు కొట్టాడు. ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (357) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Advertisement
Advertisement
ఏబీ డివిలియర్స్ ఇప్పుడు 3వ స్థానంలో చెన్నై టీమ్ కెప్టెన్ ఎం.ఎస్.ధోసి 239 నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నెంబర్ వన్ స్థానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయాలంటే మాత్రం మరో రెండు, మూడు ఐపీఎల్ సీజన్లు గడిచిపోవాల్సిందే. ఎక్కువగా ఆర్సీబీ జట్టులో ఉన్న సమయంలోనే దాదాపు 300 వరకు సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల రికార్డు దాదాపు మరో మూడేళ్ల వరకు క్రిస్ గేల్ చేతిలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. గేల్ రికార్డును బ్రేక్ చేయాలంటే మాత్రం సూర్యకుమార్, రోహిత్ శర్మ వంటి భారత క్రీడాకారులకే సాధ్యమవుతుంది. గేల్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో వేచి చూడాలి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
IPL 2023 : ప్లే ఆఫ్స్ లోకి ఈ నాలుగు జట్లు…? SRH డేంజరస్ టీమ్…!
ఆదిపురుష్ మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే ?
Chanakya Niti : మీ ప్రేమ పదిలంగా ఉండాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!