Ad
భారత్ లో క్రికెట్ అనేది ఎంత పెద్ద గేమ్ అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో మహిళల జట్టు కూడా చాలా రోజులుగా ఉంది. కానీ మహిళల క్రికెట్ కు మాత్రం ఈ మధ్యే గుర్తింపు అనేది వస్తుంది. అభిమానులు వారి ఆటను కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మహిళా జట్టులో కూడా గొప్ప బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు.
ఇక అలాంటి ఓ మహిళా బౌలర్ భారత పురుషుల క్రికెట్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మను ఇబ్బంది పెట్టింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ ఎలాంటి ఆటగాడు అనేది అందరికి తెలుసు. అలాంటి హిట్ మ్యాన్ ను ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో కాదు.. భారత సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి. మహిళా క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్న గోస్వామి.. ప్రస్తుతం ఉన్న ఇంగ్లాండ్ పర్యటన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా తాజాగా రోహిత్ ఝులన్ గోస్వామికి అభినందనలు తెలిపి ఆమె గురించి మాట్లాడాడు. నేను ఓ సారి గాయం వల్ల ఎన్సీఏ లో ఉన్న సమయంలో ఝులన్ కూడా అక్కడే ఉంది. అప్పుడు ప్రాక్టీస్ లో భాగంగా ఆమె నాకు బౌలింగ్ చేసింది. ఝులన్ యొక్క ఇన్ స్వింగ్ ను ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. నాకు ఝులన్ బౌలింగ్ చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది అని రోహిత్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :
భారత జట్టు కొత్త జెర్సీ వెనుక ఇంత కథ ఉందా..?
ఆ పేపర్లో మీరు అనుకునేది లేదు.. ఏం ఉందొ తెలిస్తే అంతే..?
Advertisement