విరాట్ కోహ్లీనే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ. రన్ మిషిన్ గా పేరు తెచుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఆ రన్స్ చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. ఎన్నో సెంచరీలు నీళ్లు తాగినంత సులువుగా బాదేసిన విరాట్… ఇప్పుడు ఆ సెంచరీ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఎప్పుడు 2019 లో చివరి100 కొట్టిన విరాట్.. ఇప్పటివరకు మళ్ళీ 100 కోటకుండానే 100కి పైగా మ్యాచులు ఆడేసాడు. అందువల్ల విరాట్ పై ప్రతి వైపు నుంచి విమర్శలే వస్తున్నాయి. మరి ముఖ్యంగా మన భారత మాజీ ఆటగాళ్లే ఎక్కువగా విరాట్ ను విమర్శిస్తున్నారు.
Advertisement
ఇక మీదట విరాట్ ను జట్టులో ఉంచకూడదు అని.. ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ కు విరాట్ ను కాకుండా ఎవరైనా యంగ్ ఆటగాడిని పంపాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా విరాట్ పై వస్తున్న విమర్శలను భారత వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప తప్పు బట్టాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 70 సెంచరీలు చేసాడు. అతను అలా సెంచరీలు చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికీ మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే.. కోహ్లీ అప్పుడు ఎలా ఆడాడో ఇప్పుడు అలానే ఆడుతున్నాడు. కాబట్టి అప్పుడు మాట్లాడని ఎవరు ఇప్పుకు కూడా మాట్లాడకూడదు.
Advertisement
అయితే ఇప్పుడు మననము చేయాల్సిన పని అతడిని ఒంటరిగా వదిలేయడమే. ఎందుకంటే.. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో మ్యాచ్ లను తాను ఒక్కడే గెలిపించాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటకు రావాలో అతనికి తెలుసు. అయితే అతను బ్రేక్ కావాలని అనుకుంటుంటే.. అతడిని బ్రేక్ తీసుకొనివండి. ఆడాలి అనుకున్నప్పుడు ఆడనివ్వండి. ఇక జట్టులో అతడిని స్థానానికి ఏ డోకా లేదు. ఎందుకంటే.. కోహ్లీ ఒక్క మ్యాచ్ విన్నర్. క్రికెట్ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో అతను ఒక్కడు అని రాబిన్ ఊతప్ప కోహ్లీ విమర్శకులకు తెలిపాడు.
ఇవి కూడా చదవండి :