జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి Rk రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇర్రిటేషన్ స్టార్ రెండు రోజులుగా వాలంటిర్లని, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. జగన్ అంటే వణుకు అనుకున్నా… జగన్ తీసుకువచ్చిన వాలంటిర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవని… 2024 లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి అర్ధం అయిందని ఫైర్ అయ్యారు రోజా.
Advertisement
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని…పవన్ కళ్యాణ్.. వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారని హెచ్చరించారు. మహిళల అక్రమ రవాణా వాలంటిర్ల వల్లే జరుగుతుంది అని మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు.? అని నిలదీశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణా 6 స్థానంలో ఉందని… కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడితే హైదరాబాద్ లో వుండలేవంటూ మండిపడ్డారు.
Advertisement
చంద్రబాబు పాలనలో జరిగిన అన్యాయలపై ఎందుకు స్పందించలేదు.. అప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని పవన్ పై ఫైర్ అయ్యారు రోజా. బాలకృష్ణ జనసేన వాళ్ళను అలగా జనం అన్నారని.. అదే బాలక్రిష్ణ ఇంటర్యూ కి పిలిస్తే ఎలా వెళ్ళావని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల పేరు ఎత్తి మాట్లాడారా? సాక్షాత్తు ముస్సోరి IAS సిలబస్ లో వాలంటరి వ్యవస్థ గురించి పెట్టారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి అయినా వేళదామని… నేను గెలిచిన నగరి అయినా, భీమవరం, గాజువాక అయినా… వాలంటిర్ల పని తీరు గురించి అక్క చెల్లెమ్మలను అడుగుదామని సవాల్ చేశారు రోజా. పవన్ కళ్యాణ్ కి 55 సంవత్సరాలు వచ్చినా కనీసం ఎంపిటీసీ కూడా కాలేదంటూ చురకలు అంటించారు.
ఇవి కూడా చదవండి
అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?
ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్