దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వ్యూహం. ఈ సినిమాకి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వివాదస్పదంగా నిలుస్తోంది. ఏపీ సీఎం వై.ఎస్ జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేస్తున్నామని వర్మ ప్రకటించడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. వాస్తవానికి ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నటీనటులు : అజ్మల్ అమీర్, మానస రాధ, క్రిష్ణన్, ధనంజయ్, ప్రభునే, సురభి, ప్రభావతి, వాస్ ఇంటూరి, కోటా, జయరాం
సంగీతం : ఆనంద్
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ : సజీస్ రాజేంద్రన్
ఎడిటింగ్ : మనీష్ ఠాకూర్
కథ మరియు విశ్లేషణ :
రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వీరశంకర్ రెడ్డి మరణం నుంచి సినిమా ప్రారంభం అవుతుంది. ఆయన మరణంతో ఆయన కుమారుడు మదన్ (అజ్మల్ అమీర్) ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన తండ్రి మరణంతో అనేక వందలమంది ప్రాణాలు కోల్పోయారని విషయం తెలిసి వారందరినీ ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు. అయితే అందుకు భారత్ పార్టీ హై కమాండ్ ఒప్పుకోదు. దానికి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు (ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీతో కలిసి అక్రమ ఆస్తుల కేసులు పెడతారు. దీంతో ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటాడు మదన్. అక్రమాస్తుల కేసులో మదన్ జైలుకు వెళ్లి వచ్చాక జరిగిన ఎన్నికల్లో శ్రవణ్ కళ్యాణ్ మద్దతుతో ఇంద్ర బాబు గెలుస్తాడు. ఆ తర్వాత ఇంద్ర బాబుకు.. శ్రవణ్ కు మధ్య ఎందుకు దూరం పెరిగింది? మదన్ ప్రజలకు ఎలా దగ్గర అయ్యాడు? కనీవినీ ఎరుగని రీతిలో ఎలా గెలుపు బావుటా ఎగురవేశాడు? అనేది తెలియాలంటే ఈ మూవీ వీక్షించాల్సిందే.
Advertisement
సినిమా ప్రారంభం అయినప్పటి నుంచే ఈ మూవీలో పాత్రలు, పాత్రదారులు ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు రాంగోపాల్ వర్మ వాయిస్ ఓవర్ వస్తుంది. సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పుడే ఈ మూవీ వైఎస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు సమహారమని రాంగోపాల్ వర్మ చెప్పారు. వీ.ఎస్.వీర శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి మొదలైన ఈ మూవీ ఆ తరువాత ఆయన కుమారుడు మదన్ మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులకు లోనయ్యారు? ఎలాంటి పరిస్థితుల్లో ఓదార్పు యాత్ర , 2014 ఎన్నికలను చూపించడమే కాక అప్పుడు ఇంద్రబాబు, శ్రవణ్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు ఎలా వెళ్లారు? ఎలాంటి హామీ ఇచ్చారు ? మదన్ మోహన్ ఎలాంటి హామీ ఇచ్చారు. వంటి విషయాలను చూపించారు. ఆ తరువాత అసలు లీడర్ కూడా అవ్వాలని అనుకోని మదన్ మోహన్ ఎందుకు ప్రజలకు దగ్గర అవ్వాలి అనుకున్నాడు ? ప్రజలకు ఏం చేయాలనుకున్నాడు ? వంటి విషయాలను చూపించారు. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గెలుపు వరకు ఈ సినిమా సాగుతుంది. మదన్ మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఆయన భార్య మాలతి అనే పాత్ర నటించిన మానస కూడా సెటిల్డ్ పర్ఫామెన్స్ చేసింది. ఇంద్రబాబు పాత్రలో నటించిన ధనంజయ్ లుక్స్, నటన విషయంలో మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలినా కూడా ఫర్ఫెక్ట్ సూట్ అయ్యారు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది.
పాజిటివ్ పాయింట్స్ :
- రామ్ గోపాల్ వర్మ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
- సినిమా స్లోగా సాగడం
- మధ్య మధ్యలో బోరు కొట్టడం
రేటింగ్ : 2.75/5
Also Read : OPERATION VALENTINE MOVIE REVIEW : ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?