Home » గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రేణు దేశాయ్

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రేణు దేశాయ్

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన బెంగాలీ బ్యూటీ రేణు దేశాయ్…. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లపాటు ప్రేమ జీవితం… సాగించిన వీరిద్దరూ… కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరో దేశ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

రేణు దేశాయ్ మాత్రం అకిరా మరియు ఆద్య ల బాగోగులు దగ్గరుండి చూసుకుంటూ ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను తెలియజేస్తుంది ఈ బ్యూటీ. ఇదంతా పక్కకు పెడితే… తాజాగా పవన్ కళ్యాణ్… భార్య రేణు దేశాయి కూడా తన అనారోగ్యం గురించి వెల్లడించారు. తాను కొన్నేళ్లుగా గుండె మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. తనను దగ్గరగా చూస్తున్న వారికి ఈ విషయం గురించి తెలుసునని వెల్లడించారు.

వాటిని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని కూడగట్టుకుంటున్నానని తెలిపారు. తనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని మందులు కూడా వాడుతున్నానని… వైద్యుల సూచనల ప్రకారం యోగ చేస్తున్నానని చెప్పారు. మంచి పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నానని రేణు దేశాయి స్పష్టం చేశారు. ఈ సమస్య వచ్చిన చాలా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు. దీంతో రేణు దేశాయి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

read also : మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Visitors Are Also Reading