Home » Renudesai : పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత.. రేణు దేశాయ్ ఆ కారణం వల్లనే మళ్లీ పెళ్లి చేసుకోలేదా ?

Renudesai : పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత.. రేణు దేశాయ్ ఆ కారణం వల్లనే మళ్లీ పెళ్లి చేసుకోలేదా ?

by Anji
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. జేమ్స్ పాండు అనే తమిళ మూవీలో పార్థిబన్ పక్కనే హీరోయిన్ గా 2000లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత తెలుగులో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమ.. పెళ్లి జరిగిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. 2003లో జానీ మూవీ తరువాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. 2012లో పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత పిల్లల బాధ్యతలో ఇంటికే పరిమితమయ్యారు. చాలా గ్యాప్  తరువాత రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ఈ సందర్భంలో రేణు తన వ్యక్తి గత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రేణు దేశాయ్ రీసెంట్ గా మీడియాతో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంా అబ్బాయి పుడుతాడని ఎక్స్ పెక్ట్ చేస్తే.. తను పుట్టినందుకు తన తల్లిదండ్రులు చాలా డిసాప్పాయింట్ అయ్యారని రేణు దేశాయ్ పేర్కొన్నారు. మూడు రోజుల వరకు తండ్రి తన ముఖం కూడా చూడలేదని రేణుక కి తల్లి చెప్పాడట. ఆడపిల్ల పుట్టిందని.. చంపేసిన వారుననారు. కానీ తన తల్లిదండ్రులు చదువుకున్న వారు కాబట్టి తనను చంపలేదని.. చెబుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తల్లి లేని వారి కంటే కూడా తల్లి ఉండి ఆ ప్రేమను పంచకపోవడం నరకమని.. తన తల్లిదండ్రులు ప్రేమకోసం తను పరితపించాడని.. రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

చాలా మంది తన జీవితంలో డైవర్స్ చాలా బ్యాడ్ పీరియడ్ గా అనుకుంటారని.. వాస్తవానికి తన పుట్టింట్లో తల్లి దండ్రుల ఆదరణకు నోచుకోని బిడ్డగా పెరిగిన సమయమే తన బ్యాడ్ పీరియడ్ అన్నారు. తనను పని వాళ్లు పెంచారని.. చెప్పుకొచ్చారు. తనకుపవన్ తో విడాకులు అయిన తరువాత వేరొకరితో ఎంగేజ్ మెంట్ అయినా తన లాంటి పరిస్థితి తన పిల్లలకు ఎదురు కాకూడదనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు రేణు దేశాయ్ చెప్పారు. తనకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం అని.. రెండు, మూడేళ్లలో పిల్లలు పూర్తిగా సెట్ అవుతారని తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని రేణు స్పష్టం చేశారు.  అకీరాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతం లేదని.. వస్తే తప్పకుండా గ్రాండ్ గా అనౌన్స్ చేస్తానని రేణు దేశాయ్ చెప్పారు. రేణు దేశాయ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నయనతారపై దారుణంగా ట్రోలింగ్..ఆ సర్జరీ చేయించుకుందంటూ !

సాయి ధరమ్ తేజకు షాక్…విరూపాక్ష సీక్వెల్ లో అఖిల్…!

Visitors Are Also Reading