Home » ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు.. అందుకోసమేనా ?

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు.. అందుకోసమేనా ?

by Anji
Ad

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం ఎదురైంది. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. తెల్లవారుజామునే తారక్, కళ్యాణ్ రామ్ లు తాతకు నివాళులు అర్పించారు. జూనియర్ రాక సందర్భంగా ఆయన అభిమానులు ఘాట్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ వెళ్ళిన కాసేపటికి బాలకృష్ణ సైతం తన తండ్రికి అంజలి ఘటించారు. బాలకృష్ణ నివాళులు అర్పించి వెళ్ళగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఘాట్ నిర్వాహకులు తొలగించడం గమనార్హం.

Advertisement

Advertisement

. బాలయ్య చెబితేనే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారని అంటున్నారు. గత కొంత కాలం నుంచి బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి వివాదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అసలు ఎందుకో తెలియదు వీరు చాలా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా  చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్   జైలులో ఉన్న సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించలేదు. టీడీపీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తాజాగా ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు బాలయ్యకి దర్శనమిచ్చాయి. వీటిని చూసిన బాలకృష్ణ ఆగ్రహానికి గురై తీసివేయాలని ఘాట్ నిర్వహకులను సూచించినట్టు సమాచారం. వెంటనే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్లెక్సీలు అన్ని తొలగించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading