కన్నడ సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ కి ముందు కేజిఎఫ్ తర్వాత అని చెప్పుకునేలా ప్రశాంత్ నీల్ ట్రెండ్ ను సెట్ చేశారు. తెలుగు సినిమాలకు రాజమౌళి… తమిళ సినిమాలకు శంకర్ అయితే కన్నడ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చింది మాత్రం ప్రశాంత నీల్ అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ ఎలాంటి అంచనాలు లేకుండా కేజిఎఫ్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
Advertisement
కానీ సినిమా విడుదలైన తర్వాత అన్ని భాషల్లోనూ మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. దాంతో ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఆరు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మరిన్ని కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
ప్రశాంత్ నీల్ తమది ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠ పురం అనే గ్రామం అని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి తనకు సమీప బంధువు అవుతారని చెప్పారు. అయితే రఘువీరా రెడ్డి తో బంధుత్వం ఏంటని అడగగా ప్రశాంత్ నీల్ తండ్రి నీలకంటాపురం సుభాష్ రెడ్డి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తండ్రికి తమ్ముడి వరస అవుతారట. అలా రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ ఇద్దరు అన్నదమ్ములని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ తండ్రి కర్ణాటకకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోగా వీరి కుటుంబం ఆ తర్వాత కర్ణాటకలోనే స్థిరపడింది. మరోవైపు టాలీవుడ్ నటులు ఆదర్శ్ తండ్రి బాలకృష్ణ కూడా ప్రశాంత్ కు అంకుల్ అవుతారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదర్శ్ బాలకృష్ణకు కేజిఎఫ్ 2లో ఇనాయత్ అనే ముఖ్యమైన రోల్ లో నటించే అవకాశం ప్రశాంత్ నీల్ కల్పించారు. ఇక ప్రశాంత్ నీల్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడు అని తెలియడం తో తెలుగు వాళ్ళు ఖుషీ అవుతున్నారు.
Also read :
ఆలీ జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా..? రోడ్డు పక్కన బట్టలు అమ్ముతూ…!
Rajamouli: ఆ మెగా హీరో మీద కోపంతో ‘ఈగ’ సినిమా తీసారట రాజమౌళి !