Home » ఆలీ జీవితంలో ఇన్ని క‌ష్టాలున్నాయా..? రోడ్డు ప‌క్క‌న బట్ట‌లు అమ్ముతూ…!

ఆలీ జీవితంలో ఇన్ని క‌ష్టాలున్నాయా..? రోడ్డు ప‌క్క‌న బట్ట‌లు అమ్ముతూ…!

by AJAY
Ad

టాలీవుడ్ టాప్ కమెడియన్ లలో ఆలీ కూడా ఒకరు. ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ తో ప్రారంభించి టాప్ కమెడియన్ లలో కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆలీ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటున్నారు. అదేవిధంగా టీవీ షోలతో కూడా అలీ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆలీ ప్రస్తుతం టాప్ కమెడియన్ లలో ఒకరిగా ఉన్నారు కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆలీ సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆలీ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

Advertisement

కాగా రాజమండ్రిలో మోహన్ మిత్ర అనే ఓ పెద్దమనిషి ఉండేవాడు. ఆయన కు ఆర్కెస్ట్రా ఉంది. ఒక రోజు ఆయ‌న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన లుంగీలు, లంగాలు లాంటి దుస్తులు అమ్ముతూ పిల్లాడు కనిపించాడు. దాంతో ఆ పిల్లాడిని ఆయన దగ్గరకు తీసుకున్నాడు. ఏం అమ్ముతున్నావు అని అడిగితే ఆ పిల్లాడు వెటకారంగా సమాధానం చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. దాంతో అది చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి నా కొడుకు అంటూ ఆయ‌న‌కు పరిచయం చేశాడు.

Advertisement

ఏం చేశాడు అని అడిగితే ఏం లేదులే అంటూ ఆలీ తండ్రికి మోహ‌న్ మిత్ర‌ సమాధానమిచ్చాడు. అంతే కాకుండా పిల్లవాడితో ఇలా పని చేస్తున్నావ్ ఏంటి అని ఆలీ తండ్రిని అడిగాడు. దాంతో ఆలీ తండ్రి వీరికడి చదువు రావట్లేదు అంటూ సమాధానమిచ్చాడు. అందుకే ఈ పని చేయిస్తున్నాను అని చెప్పాడు. దాంతో మోహన్ మిత్రా తనతోపాటు తీసుకెళ్లి నీకు ఏం వచ్చు అని ఆలీని ప్రశ్నించాడు. దానికి ఆలీ అమితాబ్ బచ్చన్ షోలే సినిమా లోని డైలాగ్స్ చెప్పేసాడు.

ali yamaleela

అదేవిధంగా షోలే సినిమాలో లో పాట పాడితే స్టెప్పులు వేశాడు. అదేవిధంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ ల మిమిక్రీ చేసి చూపించాడు. దాంతో మొహన్ మిత్ర‌ ఎంతో మెచ్చుకున్నారు. తనతో పాటు ఆర్కెస్ట్రాలో పని క‌ల్పించాడు. ఇక ఓ రోజు మోహన్ మిత్రాను దర్శకుడు విశ్వనాథ్ గారు కలిసారు. తనకు ఓ పిల్లాడు కావాలని అడగడంతో మోహన్ మిత్ర ఆలీని పరిచయం చేశారు. అలా మొద‌ట‌గా ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ఆలీకి ప్రెసిడెంట్ పేరెమ్మ అనే సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. ఆ త‌ర‌వాత ఆలీ అంచెలంచెలుగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.

ALSO READ : 

ఎన్టీఆర్ కి బయపడి వాయిదా వేసుకున్న చిరు సినిమా అదే అని తెలుసా ?

కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!

Visitors Are Also Reading