సినిమా ఇండస్ట్రీలో హీరోలు సంపాదించుకునే పేరును చాలా మంది హీరోయిన్స్ సాధించలేరు. ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్ కు అవకాశాలు వచ్చే సమయం అనేది తక్కువగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం హీరోల మాదిరే సినిమాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. అలాగే తమ నటనతో.. చేసే సినిమాలతో పేరు, క్రేజ్ అనేది బాగానే పొందుతారు. అలాంటి వారిలో స్వీటీ అనుష్క కూడా ఉంటుంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చాలా రోజులు కొనసాగిన అనుష్క.. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా తాను చేసిన అన్ని సీనియాలతో పేరును బాగానే సంపాదించింది. ఇక ప్రభాస్ తో కలిసి బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాలో చేసి హిట్ అందుకున్న అనుష్క.. మళ్ళీ సినిమాలు చేయడం లేదు. ఆ మధ్యలో సైజ్ జీరో సినిమా కోసం బాగా లావుగా అయిన అనుష్క మళ్ళీ సన్నగా కాలేకపోతుంది.
ఇక ఈ మధ్య కాలంలో అనుష్క ఇంకా ఎక్కువగా లావుగా మారింది అని తెలుస్తుంది. అందుకు కారణం అనుష్క ఏది ఆరోగ్య సమస్యతో బాధ పడుతుంది అని తెలుస్తుంది. అందుకే ఆమె బరువు అనేది బాగా పెరుగుతుంది అని సమాచారం. అయితే ఈ సమస్య వల్లే ఈ మధ్యే కాలంలో సినిమాకు దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క.. ప్రస్తుతం తన ఫిట్నెస్ పైన ఫోకస్ చేసింది అని టాక్. మళ్ళీ సన్నగా మారడానికి సమంత అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :