Ad
తెలుగు సినిమా ప్రపంచంలో చాలా మాబ్ది గొప్ప నటులు హీరోలు ఉన్నారు. అయితే అందులో కొంతమంది ఇప్పటికి ఇండస్ట్రీతోనే ఉండగా మరి కొందరు ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా దూరమయ్యారు. అటువంటి వారిలో హీరో వడ్డే నవీన్ కూడా ఒక్కడు. టాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచుకున్న నవీన్.. ఆ తర్వాత సెకండ్ హీరోగా… అలాగే సపోర్టింగ్ పాత్రలో కూడా నటించారు. కానీ ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అసలు ఎటువంటి ఫంక్షన్ లలో గాని… సోషల్ మీడియాలో కూడా ఆయన అభిమానులకు దర్శనం ఇవ్వలేదు..
అయితే ఇండస్ట్రీకి దూరమైన చాలా మంది ప్రస్తుతం ఇప్పుడు కనీసం ఇంటర్వ్యూలు అయిన ఇస్తుంటే నవీన్ మాత్రం ఆ పని కూడా చేయడం లేదు. అందువల్ల ఆయన ఇండస్ట్రీకి ఎందుకు పూర్తిగా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అనే తాజాగా పీఆర్వో వినాయకరావు గారు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన వినాయకరావు అందులో తాను చాలా సినిమాలకు పీఆర్వోగా చేశాను అని.. అందరూ హీరోల గురించి అంకు తెలుసు అని అన్నారు. ఈ క్రమంలోనే వడ్డే నవీన్ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా చెప్పారు.
ఆయన వడ్డే నవీన్ గురించి మాట్లాడుతూ… వడ్డే నవీన గారు చాలా మంచి సినిమాల్లో నటించారు. ఖాతాను ను చూసే సినిమాను ఒప్పుకునేవారు. అయితే ఆయన సినిమాలు మొదట్లో బాగా ఆడిన… ఆ తర్వాత పెరిగిన కాంపిటీషన్ కారణంగా ఆయన సినిమాలు విజయం అందుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల పై ఫోకస్ అనేది పెట్టలేదు. అందుకే ఆయనకు అవకాశాలు కూడా రావడం తగ్గిపోయాయి. అందువల్లే ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు తప్పించి వేరే ఏ కారణాలు లేవు అని వినాయకరావు గారు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ఆర్డర్.. రావాల్సిందే..?
పెళ్లి చేసుకున్న ఇద్దరు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు..
Advertisement