Home » ఆచార్య ప్లాప్ అయితే దర్శకుడు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నాడో తెలుసా…?

ఆచార్య ప్లాప్ అయితే దర్శకుడు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నాడో తెలుసా…?

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కలిసి ఓ సినిమా అనౌన్స్ చేయడం తోనే విపరీతమైన బజ్ అనేది ఈ సినిమాపైన ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఏ ఈ సినిమా పైన అంచనాలు అనేవి ఇంకా ఎక్కువయ్యాయి. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అని డిసైడైన అభిమనులు అందరూ ట్రైలర్ చుసిన తర్వాత కొంచెం వెన్నకు తగ్గారు. ఇక సినిమా అనేది వచ్చిన తర్వాత మొదటి రోజు మొదటి షోకే ఆచార్య అనేది ప్లాప్ అని తేల్చేసారు. ఇక రెండు, మూడు రోజుల తర్వాత ఆచార్య డిజాస్టర్ అనే టాక్ వచ్చేసింది.
అందువల్ల ఈ సినిమాకు భారీ నష్టాలూ అనేవి వచ్చి నిర్మాత నష్టపోయారు. అయితే ఇలాంటి సమయంలో మాములుగా హీరోలుగాని.. దర్శకులు గాని తమ రెమ్యునరేషన్ లో కొంతబాగామో.. లేక మొత్తం రెమ్యునరేషన్ అనేది ఇవ్వడమో జరుగుతుంది. కానీ ఇక్కడ ఆచార్య దర్శకుడు కొరటాల శివ తానా ఆస్తులు అమ్ముకుంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దాంతో సినిమాకు నష్టం వస్తే నిర్మాత ఆసక్తులు అమ్ముకుంటాడు గాని.. దర్శకుడు ఇలా చేయడం ఏమిటి… అసలు ఆస్తులు కొరటాల ఎందుకు అమ్ముకుంటున్నాడు అనే చర్చ మొదలయ్యింది.
అయితే ఈ విషయంలో తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది బయ్యర్లకు కొరటాల సినిమా హిట్ అని చెప్పి.. నెమ్మది అంటూ సినిమాను కోపించాడట. అలాగే కొన్నిచోట్ల బయ్యర్లతో భాగసౌమ్యం కూడా పెట్టుకుంటాడట కొరటాల. అందువల్లే సినిమా అనేది విడుదలై.. డిజాస్టర్ అయిన తర్వాత కొరటాలను నమ్మి సినిమా కొన్న బయ్యర్లు అందరూ తమ నష్టపరిహారం అనేది ఇవ్వాలని డిమాబ్ద్ చేస్తున్నారట. ఇక ఈ విషయంలో ఈ మధ్యే టాలీవుడ్ పెద్దలు అందరూ సద్ది చెప్పడంతో కొంతమేర నష్టం భరించడానికి కొరటాల ఒప్పుకున్నాడు అని తెలుస్తుంది. అందుకే ఆయన తన ఆస్తులు కొన్ని అమ్ముతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading